![]() |
![]() |

2007 నుంచి యూరప్ కంట్రీ 'యుకే'(uk)లో నిర్వహించే 'బాలీవుడ్ బిగ్ వన్ షో'(Bollywood Big One Show)అనే ఈవెంట్ లో బాలీవుడ్ అగ్రతారలు పాల్గొని అక్కడి సినీ అభిమానుల్ని ఎంతగానో అలరిస్తుంటారు. ఈ క్రమంలోనే వచ్చే నెల 4 ,5 తేదీలలో సల్మాన్ ఖాన్, వరుణ్ ధావన్(Varun Dhawan)కృతి సనన్(Kriti Sanon)మాధురి దీక్షిత్, టైగర్ ష్రఫ్, దిశా పటాని లాంటి వారు ఆ వేడుకలో ఆడిపాడనుండటంతో అక్కడి ప్రేక్షకులు భారీ ఎత్తున ఈ షో కోసం వెయిట్ చేస్తున్నారు.
కాని 'పహల్ గామ్'(Pahalgam)లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో టూరిస్టులు మరణించడంతో 'బాలీవుడ్ బిగ్ వన్ షో'ని వాయిదా వేశారు. ఈ విషయంపై సల్మాన్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తు 'యుకే ఈవెంట్ ని వాయిదా వెయ్యడం అంత తేలికైన విషయం కాదు. కానీ కాశ్మీర్ లో జరిగిన విషాద సంఘటన దృష్ట్యా వాయిదా వెయ్యాలని నిర్ణయించుకున్నాం. అందరి క్షేమం మాకు ముఖ్యం. అభిమానులు మా ప్రదర్శన కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలుసు. అయితే ఇలాంటి సమయంలో విరామం ఇవ్వడం సరైనదని అనుకుంటూ వాయిదా వేస్తున్నాం. అభిమానులు అసౌకర్యానికి గురయితే క్షమించండి. త్వరలోనే కొత్త తేదీలు ప్రకటిస్తామని తన పోస్ట్ లో తెలిపాడు.

![]() |
![]() |